పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరిచిన మద్దూరు పోలీసులు
మద్దూరు అక్టోబర్21, ప్రజా వాణి,
మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సారి అక్టోబర్ 21న ఉదయం 8గంటలకు విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకునేందుకు కమాన్ వద్ద నిర్మించిన పోలీసు అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించాల్సిన మద్దూరు పోలీసులు పోలీస్ అమరుల వీరులను మర్చిపోవడం విడ్డూరంగా ఉందని పలువురు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందించడం లేదు.

