📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు

డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు

📰 Generate e-Paper Clip

డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు
డీజేలను సీజ్ చేస్తాం: కూసుమంచి ఎస్సై సతీష్
కూసుమంచి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
దుర్గామాత నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు ఏర్పాటు చేయవద్దని కూసుమంచి ఎస్సై సతీష్ మండల ప్రజలకు, యువతీ యువకులకు, గ్రామ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. డీజేల అధిక శబ్ద తీవ్రత వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, డీజే యజమానులు, ఆపరేటర్లు, డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మండలంలోని గ్రామాల ప్రజలు పోలీసులకు సహకరించి, నిబంధనలు పాటిస్తూ దుర్గామాత నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై సతీష్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.