*చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా విజయదశమి*
*మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో విజయదశమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావణ దహనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మున్సిపాలిటీ ఆవరణ మొత్తం పూల తోరణాలతో, విద్యుత్ దీపాలతో కళకళలాడింది. వేడుకను చూసేందుకు చండూర్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, “చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి. అందరూ ఐక్యంగా ఉండి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని” కోరారు.

