ఘట్‌కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): జన చైతన్య సేవాసమితి ఆధ్వర్యంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్ నేతృత్వంలో 13వ విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో రావణ దహనం, బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబ్బసాని యాదగిరి యాదవ్ కుమార్తె రిమోట్ ద్వారా రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురుకుల్ కళాశాల మైదానం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. బాణాసంచా ప్రదర్శనతో మైదానమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా జన చైతన్య సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్‌ను పలువురు నాయకులు, ప్రముఖులు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. జన చైతన్య సేవాసమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములై వేడుకలను దిగ్విజయం చేశారు.
వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అబ్బసాని యాదగిరి యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేడుకలకు తరలివచ్చిన ప్రజలకు, సహకరించిన నాయకులకు, సమితి సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


