📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదసరా పండుగ శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

దసరా పండుగ శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

📰 Generate e-Paper Clip

దసరా పండుగ శుభాకాంక్షలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

• ఆందోల్ నియోజకవర్గo పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

• వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 20
అందోల్ : జిల్లా ప్రతినిధి

దసరా పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా, శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన సందర్భానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూల సౌందర్యంతో కళకళలాడుతాయి. విజయదశమి రోజున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
ఈ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించడంతోపాటు ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చింతనను చాటిచెబుతుంది. చెడు ఆలోచనలను విడనాడి మంచి మార్గంలో పయనించాలని, సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని దసరా పండుగ సందేశమిస్తోంది.
ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.