📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు

కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు

📰 Generate e-Paper Clip

కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు.

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 19

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూనవరంలో ఏర్పాటు చేసిన కూటమి ముఖ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
మండలంలోని ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీల మధ్య సమన్వయంతో పనిచేస్తూ కూటమి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు, పోడియం అప్పారావు,చెలికాని ఉమా, ఏచు రవి, రాము,బాలు, రసూల్,చందు,జనసేన మండల అధ్యక్షులు దాసరి నరేంద్ర, మాజీ సర్పంచ్ హేమంత్ గాంధీ కుమార్, బండారు సాంబశివరావు, బీజేపీ నాయకులు పాయo వెంకయ్య, కూటమి ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.