
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి (బి) గ్రామానికి చెందిన పంప్ ఆపరేటర్ విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం.. వెంకట్రావుపల్లి (బి) గ్రామానికి చెందిన *కసరవేణి కుమార్* పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. *ఎస్సై అమూల్య* ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

