📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరాజారాంపల్లిలో దారుణం.. పాతకక్షల నేపథ్యంలో యువకుడి హత్య

రాజారాంపల్లిలో దారుణం.. పాతకక్షల నేపథ్యంలో యువకుడి హత్య

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 19 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ శివారులోని పాతగూడూరు చౌరస్తా వద్ద అర్ధరాత్రి జరిగిన కత్తిపోట్ల దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో తలెత్తిన ఘర్షణలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన బొంతు మల్లయ్య ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా బొంతు మల్లయ్య భార్యకు, ధర్మారానికి చెందిన శివరాత్రి మల్లేష్ (40) అనే వ్యక్తికి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మల్లయ్య కుమారుడు బొంతు సంతోష్ (17) రాజారాంపల్లి గ్రామంలోని పాతగూడూరు చౌరస్తా వద్ద ఉన్నాడు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న శివరాత్రి మల్లేష్, ఆయన కుమారుడు శివరాత్రి అనిల్ కుమార్ (21) అక్కడికి చేరుకున్నారు. తండ్రి మల్లేష్ ప్రోత్సాహంతో అనిల్ కుమార్ సంతోష్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సంతోష్‌కు తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అంబులెన్స్ ద్వారా అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, సంతోష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుని తండ్రి బొంతు మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మపురి సీఐ ఎ రామ్ నరసింహారెడ్డి ఘటనపై దర్యాప్తు చేపట్టాగా, వెల్గటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.