📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadసుమారు.60 ఏళ్ల చరిత్రలో తొలిసారి కొత్తపల్లి వాసికి సొసైటీ చైర్మన్ పీఠం దక్కేనా ?

సుమారు.60 ఏళ్ల చరిత్రలో తొలిసారి కొత్తపల్లి వాసికి సొసైటీ చైర్మన్ పీఠం దక్కేనా ?

📰 Generate e-Paper Clip

కొత్తపల్లి సొసైటీ చైర్మెన్ పదవికి మండలంలో పెరిగిన పొలిటికల్ హీట్.

సుమారు.60 ఏళ్ల చరిత్రలో తొలిసారి కొత్తపల్లి వాసికి సొసైటీ చైర్మన్ పీఠం దక్కేనా ?

సామాజిక న్యాయం ప్రకారం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తులు.

కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేసులో పుప్పాల హనుమంతు పేరు ప్రధానంగా తెరపైకి.

పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయంపైనే కొత్తపల్లి సొసైటీ భవితవ్యం.

కోటగిరి/ప్రజావాణి:- నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సొసైటీ నామినేటెడ్ చైర్మన్ పదవి ఎంపిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.ఈ సొసైటీ చైర్మన్ పదవి కోసం కొత్తపల్లి గ్రామానికి చెందిన విద్యావంతుడు,రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్ పుప్పాల హనుమంతు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.సొసైటీ పరిధిలోని 11 గ్రామాలకు చెందిన దళిత సామాజిక వర్గ నాయకులు,ప్రజలు ఏకతాటిపైకి వచ్చి హనుమంతు అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపు తున్నారు.సుమారు 60 సంవత్సరాల క్రితం ఏర్పాటైన కొత్తపల్లి సొసైటీకి ఇప్పటివరకు కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చైర్మన్ కాకపోవడం గమనార్హం. ఈసారి ఎలాగైనా తమ ప్రాంత వాసి కే చైర్మన్ పదవి దక్కాలని గ్రామస్థులు బలంగా కోరుకుంటునట్లు వెల్లడవుతోంది.ఉమ్మడి కోటగిరి మండలంలో ఉన్నటువంటి నాలుగు సొసైటీల్లో ఇప్పటికే ఎత్తొండ సొసైటీ చైర్మన్‌గా ఓసీ వర్గానికి చెందిన నాయకులు బాధ్యతలు చేపట్టగా కోటగిరి సొసైటీ చైర్మన్ పదవిని మైనారిటీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అలాగే పోతంగల్ సొసైటీ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ప్రకారం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని పలువురు మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇటీవల కొత్తపల్లిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో నిలబడిన అభ్యర్థి విజయం కోసం హనుమంతు సొంత ఖర్చులతో ముందుండి పనిచేసిన విషయం గమనార్హం.ఇటీవల సొసైటీ పరిధిలోని సంఘ సభ్యులు,ప్రజాప్రతినిధులు,రైతులతో కలిసి ఆయన పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి చర్చించగా పోచారం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.గడిచిన కొన్ని నెలలుగా చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధత మధ్య హనుమంతు పేరు బలంగా వినిపిస్తుండటంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది.విద్యావంతులు,రిటైర్డ్ ఉద్యోగస్థు లు,స్థానికులైన హనుమంతుకు చైర్మన్ పీఠం దక్కితే సొసైటీ కి మరింత మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజక వర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సంపూర్ణ ఆశీస్సులు పుప్పాల హనుమంతుకు మెండుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.స్థానిక మండల ప్రముఖ నాయకుల చొరవ,లభిస్తున్న బలమైన నాయకత్వ సహకారంతో హనుమంతు ఎన్నిక లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.