📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

పెద్దవంగర, అక్టోబర్ 18 (ప్రజావాణి) . పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.గ్రామ ఉప సర్పంచ్ చిదిమిళ్ళ గోవర్ధన్ ఆధ్వర్యంలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఒకచోట చేరి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయబద్ధంగా గౌరమ్మకు పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ పాటలు, కోలాటాలతో గ్రామ వీధులు సందడిగా మారాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆడబిడ్డలకి చీరలు పంపిణీ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.