📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేట దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అన్నదానం

జోగిపేట దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అన్నదానం

📰 Generate e-Paper Clip

జోగిపేట దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో అన్నదానం

•స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.. 3,000 మంది భక్తులకు అన్నప్రసాదం

మన ప్రజావాణి అక్టోబర్ 19 జోగిపేట: జిల్లా ప్రతినిధి

ఆందోల్‌-జోగిపేట పట్టణంలోని దుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్లోళ్ల సురోత్తం రెడ్డి, సారా శివకుమార్ అన్నదాన దాతలుగా వ్యవహరించారు. మండప నిర్వాహకులు పులుగు గోపాల్ రావు పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది.
అమ్మవారి దర్శనానికి వచ్చిన సుమారు 3,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.