📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచమ్మ ఆలయం వద్ద చండీయాగం, ...అన్నదానంమాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం

పోచమ్మ ఆలయం వద్ద చండీయాగం, …అన్నదానంమాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ మున్సిపల్ పరిధిలోని 6వ డివిజన్‌ పోచమ్మ ఆలయం వద్ద మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం హాజరయ్యారు.

కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు వెంకట్ నారాయణ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల దాస్, బొక్క సత్తి రెడ్డి, కార్యదర్శి మేకల సునీల్, కార్యనిర్వహణ అధికారి కడుపొల్ల రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోక పల్లేష్, నార్ల మల్లేష్ యాదవ్, మోటుపల్లి శ్రీనివాస్, తోక రాజు, కృష్ణ, ఏర్రోళ్ల చిన్న, సుధాకర్, శేఖర్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.