ఘట్కేసర్, అక్టోబర్ 18(ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలో లక్ష్మీనగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నార
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషంగా ఉందని కాలనీ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షుడు చల్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు అబ్బురబోని మహేందర్, కోశాధికారి సమాజానా రెడ్డితో పాటు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
కాలనీ వాసులు అమర్ కుమార్ రెడ్డి,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో లక్ష్మీనగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

