📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అన్నదానమే గొప్ప దానం

అన్నదానమే గొప్ప దానం

📰 Generate e-Paper Clip

అన్నదానమే గొప్ప దానం: ఎస్ఐ అశోక్

బాణాపురంలో పాండవసేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

ముదిగొండ అక్టోబర్ 18 ప్రజావాణి

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని ముదిగొండ ఎస్ఐ టి. అశోక్ అన్నారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పాండవసేన యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ, యువత సేవా భావంతో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, పాండవసేన యూత్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.