ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ పండుగ అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిపాడిన
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట అక్టోబర్ 18 (ప్రజావాణి)
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రాతిక సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిపాడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మా పాలకవర్గం మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత అధికారులు జమ్మికుంట పట్టణ పరిధిలోనీ 30 వార్డులకు గాను 18 చోట్ల అక్క చెల్లెళ్ళకు బతుకమ్మ ఆడుకునుటకు ప్రత్యేక ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి,పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐకమత్యంతో,ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ గౌరవ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

