📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

నారాయణఖేడ్ నియోజకవర్గం:-

పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని ప్రియాంక కాలనీలో సంతోషి మాత ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటలతో ప్రియాంక కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం సంతోషి మాతను ప్రార్థించారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాలనీ మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.