📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి మాధురి

బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి మాధురి

📰 Generate e-Paper Clip

బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి మాధురి
పెరికసింగారం, నాయకన్ గూడెంలో మహిళలతో కలిసి సంబరాలు
కూసుమంచి ప్రజావాణి:
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పెరికసింగారం, నాయకన్ గూడెం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.
ముందుగా పెరికసింగారం గ్రామంలో నిర్వహించిన అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నాయకన్ గూడెం గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలతో కలిసి ఉత్సాహంగా పాల్గొని, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల మధ్య మహిళలు సంప్రదాయ ఆటపాటలతో సందడి చేయడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.