📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

•ఆరు వేదికలపై ఆటపాటలు.. విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీనిన కింది బజార్ పెద్ద చెరువు కట్ట

•ఎనిమిది టన్నుల పూలతో 32 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ
జయారెడ్డితో కలిసి బతుకమ్మ ఆడిన నిర్మలా జగ్గారెడ్డి.. అలరించిన ఫోక్ సింగర్ కనకవ్వ పాటలు

మన ప్రజావాణి అక్టోబర్ 19 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు కట్టపై అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది.
32 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ
వేడుకల్లో భాగంగా ఎనిమిది టన్నుల పూలతో రూపొందించిన 32 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 టన్నుల ఉక్కుతో నిర్మాణాన్ని సిద్ధం చేసి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. భారీ బతుకమ్మను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఆరు వేదికలపై ఆటపాటలు.. కనకవ్వ పాటలతో సందడి
మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు చెరువు కట్ట పొడవునా ఆరు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఆయా వేదికలపై కళాకారుల ఆటపాటలు, జానపద గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఫోక్ సింగర్ కనకవ్వ పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక ట్రస్ లైటింగ్, భారీ తెరలు, ఫ్లడ్‌లైట్ టవర్లు, విద్యుద్దీపాల అలంకరణలతో చెరువు కట్ట పరిసరాలు కాంతులీనాయి. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గత పది రోజులుగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణలు పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన నిర్మలా జగ్గారెడ్డి, జయారెడ్డి
సాయంత్రం ఐదు గంటల నుంచే చెరువు కట్ట వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. నిర్మలా జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి నిర్మలా జగ్గారెడ్డి, జయారెడ్డి బతుకమ్మ ఆడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో పూల బతుకమ్మలు, జానపద గీతాలు, మహిళల ఆటపాటలు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.