ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజా వాణి) : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలు పోచారం డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ టౌన్షిప్లో అత్యంత వైభవంగా, కనులవిందుగా జరిగాయి. ఎల్ఐజీ టౌన్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నిర్వహించిన ఈ వేడుకలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో మహిళలంతా ఒకే రంగు సంప్రదాయ చీరలు ధరించి పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకే వర్ణంలో మెరిసిపోతూ మహిళామణులంతా ఒక్కచోట చేరిన దృశ్యం పండుగ శోభను రెట్టింపు చేసింది. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా చేరి, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి, ఉత్సాహంగా నృత్యాలు చేశారు. కాలనీ మహిళలంతా ఐక్యతతో, సంప్రదాయబద్ధంగా ఒకే డ్రెస్ కోడ్‌తో హాజరై వేడుకలను నిర్వహించడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చుపుచ్చుకుని, సద్దులను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సొసైటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

