ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ వెంకటాపురంలో మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ మహా చండీ హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తిభావం పెంపొందడంతో పాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావం బలపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాములు కందుల నవీన్ కుమార్, అందె అనంతరావు, చిలుక గణేష్, అందె శ్రీకాంత్, నీరుడి శ్రీనివాస్, నీరుడి దీపక్ కుమార్, తదితర సాములు పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రార్థించారు.


