📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎన్‌ఎఫ్‌సీ నగర్ దత్త సాయి మందిరం ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఎన్‌ఎఫ్‌సీ నగర్ దత్త సాయి మందిరం ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో దత్త సాయి మందిరం ఆవరణలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు.

సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగతో దత్త సాయి మందిరం ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.