📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పై టిడిపి గుండాల దాడి. ప్రజాస్వామ్య వ్యవస్థలో...

బద్వేల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పై టిడిపి గుండాల దాడి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక ప్రతిపక్షాలు శత్రువులుగా చూసుకోకూడదు.నామినేషన్ వేసే వారికి రక్షణ కల్పించాలి.

📰 Generate e-Paper Clip

గెలుపు ఓటములు స్పోర్ట్స్ మాన్ స్పిరిట్ తో తీసుకోవాలి.

విధ్వంస రాజకీయాలను ప్రజలు హర్షించరు.

న్యాయంగా ఎన్నికలు జరపటంలో విఫలం చెందిన ఎన్నికల కమిషన్.

 హింసాయుత ప్రవర్తన ఉన్న వారిపై కెమెరా ఫుటేజుల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

బాధితుల పక్షాన నిలబడకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

బద్వేల్ అక్టోబర్ 19 ప్రజావాణి బద్వేలు స్థానిక కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు, సిపిఎం కార్యాలయంలో, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దౌర్జన్యాలపై, సిపిఎం అభ్యర్థి మోక్షమ్మ గారి నామినేషన్ పత్రాన్ని లాక్కుని చించి వేయడం పై “ప్రెస్ మీట్” నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కడప జిల్లాలో నిష్పాక్షపాతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పోలింగ్ పర్సంటేజ్ ని బాగా తగ్గిస్తాయని హెచ్చరించారు. సంకుచిత రాజకీయాలు నేడు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక ప్రతిపక్షాలు శత్రువుగా చూసుకోకూడదని హితవు పలికారు. నామినేషన్ల ప్రక్రియలో శాంతి భద్రతల వైఫల్యంకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విధ్వంస రాజకీయాలు ఎవరు ప్రేరేపించిన ప్రజలు వారిని ఓడిస్తారని హెచ్చరించారు. ప్రజల అభివృద్ధికి, ప్రజల మౌలిక సౌకర్యాలపై రాజకీయ పార్టీలు తమ వైఖరులను ప్రజల ముందు పెట్టి ప్రజల విశ్వాసాన్ని పొందాలని దానికి భిన్నంగా, నామినేషన్లు వెయ్యనీయకుండా రౌడీ మూకలతో పోలీసుల సమక్షంలోనే చించు వేస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ చూస్తూ ఊరికే ఉంటున్నాయని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం అన్నారు. ప్రజలు ఏదో ఒకనాడు తిరగబడి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. డబ్బు ప్రలోభాలు పెట్టి, భయబ్రాంతుల గురిచేసి ఓటు పోల్ చేయించుకోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు తెలిపారు. బద్వేల్ లో జరుగుతున్న నామినేషన్ల చించి వేసే ధోరణి సరైనది కాదని, ఇది చైర్మన్ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. జరుగుతున్న సంఘటనలు హింస ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా ఉన్నాయని, ఎన్.డి.ఏ. పక్ష్యాల పార్టీల కూటమి బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. నాడు వైసీపీ వారు మీరు చేశారు నేడు మేము చేస్తున్నామని బహిరంగ ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడడం టిడిపి, బిజెపి, జనసేన నాయకులకు తగదని అభ్యంతరం తెలిపారు. మంచిని స్వీకరించాలి గాని చెడును స్వీకరించకూడదని హితవు పలికారు. స్వేచ్ఛాయుత, నాయబద్ధంగా ఎన్నికలు పెరిగే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధ శక్తులు ఎన్నికలను హింసాయుహితంగా మారుస్తున్నారని కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా అటువంటి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ భాష, బద్వేల్ పట్టణ కార్యదర్శి కే.శ్రీను, సిపిఎం కౌన్సిల్ అభ్యర్థులు మోక్ష మ్మ,బాలమ్మ,చేతి వృత్తిదాల సంఘం నాయకులు ఇ.రమణయ్య, జి.నాగార్జున,శ్రీనివాసులు,సుబ్బరాయుడు,ఫాతిమా, కైరుని, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.