📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriదుర్గామాతను దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వేముల మహేష్ గౌడ్

దుర్గామాతను దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటీక్యాల కృష్ణారెడ్డి, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన దర్శించుకున్నారు.

అనంతరం అమ్మవారి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వేముల మహేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం గోపాల్‌రెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ ఇటీక్యాల రామకృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ గొంగళ్ల మహేష్, నాయకులు గొంగళ్ల బాలేష్, అచ్చిని రమేష్, గొంగళ్ల చంద్రకాంత్, నానావత్ సురేష్ నాయక్, ఈగ మధు ముదిరాజ్, కొడకండ్ల లింగం తదితర నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.