జాలపల్లిలో భూ భారతి రీ సర్వేపై రైతులకు అవగాహన
దూలిమిట్ట తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్
మద్దూరు అక్టోబర్16, ప్రజా వాణి,
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ సర్వేలో బాగంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ శ్యామ్ తెలిపారు. ఈ విషయమై 16-10-2026 శుక్రవారం రోజున జాలపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో రీ సర్వేలో చేపట్టబోయే విధి విధానాలపై మరియు సర్వే ఏ విధంగా జరుగుతుంది అనే తదితర అంశాలపై చర్చించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ధూళిమిట్ట మండల తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్,డిప్యూటీ తహసీల్దార్ మండల గిర్దావర్ నవీన్, మండల సర్వేయర్, జాలపల్లి గ్రామ జి పి ఓ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కమలాకర్ యాదవ్, ప్రజా ప్రతినిధులు,జాలపల్లి గ్రామ రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
