*చేగుంట గ్రామ అభివృద్ధి లక్ష్యం- సండ్రుగు స్రవంతి సతీష్…**
ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం
చేగుంట మండల కేంద్రంలోని 10వ వార్డులో సీసీ రోడ్ పనులను *చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్* గారు ముఖ్య అతిథిగా హాజరై సీసీ రోడ్ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మాట్లాడుతూ చేగుంట గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
చేగుంట పదవ వార్డు మెంబర్ వల్ప మౌనిక మహేష్ వారి యొక్క వార్డులో సిసి రోడ్ ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ రఫీక్, వార్డు సభ్యులు ఆరిఫ్, శ్రీను, శశికాంత్ గౌడ్, లింగం, శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

