ఎండపల్లి మండల కేంద్రంలో స్థానిక ఉపసర్పంచ్ దాసరి కళ్యాణి కొమురయ్యల ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎండపల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం స్పందించి, బాధితులకు రూ.10,000 ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరుగు జంపన్న (జానీ), జిల్లా అధ్యక్షుడు ముత్యాల స్వామి, మండల అధ్యక్షుడు సింహరాజు క్రాంతి, మేడిపెల్లి సత్యనారాయణ, చెలుపూరి రవీందర్, మల్యాల విజయ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

