📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి..!

జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి జ్యోతి

ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా రెండవ రోజు బతుకమ్మ సంబరాలు*

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం రెండవ రోజు అటుకుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా బిసి అభివృద్ధి అధికారిణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వైభవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతిపై మనకున్న ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు.
వివిధ రకాల సహజసిద్ధమైన పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆనందోత్సాహాల మధ్య నిర్వహించే బతుకమ్మ వేడుకలు సామాజిక ఐక్యతను, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్‌లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్దేశించిన శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.