పిచ్చి గడ్డిని తొలగిస్తున్న సర్పంచ్ నాగనాథ్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో ఆదివారం రోజున గ్రామంలో పిచ్చి గడ్డి పెరగడంతో సర్పంచ్ వెంటనే స్పందించి మందుతో పిచికారి చేయించిన సర్పంచ్ నాగనాథ్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పిచ్చి గడ్డి వల్ల విష పురుగులు, వస్తాయని అలాగే దోమల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా మురికి కాలువలను ఎప్పటికప్పుడే శుభ్రం చేయిస్తున్నామని సర్పంచ్ ఈ సందర్భంగా మాట్లాడారు.. సర్పంచ్ తో పాటు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

