దసరా నవరాత్రుల తొలి రోజు.. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కనకదుర్గమ్మ అలంకరణ
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
కూకట్పల్లి (ప్రజావాణి): ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూకట్పల్లిలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
నవరాత్రుల తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

