📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎవరు దొంగిలించలేని సంపద "విద్య" మాత్రమే

ఎవరు దొంగిలించలేని సంపద “విద్య” మాత్రమే

📰 Generate e-Paper Clip

ఎవరు దొంగిలించలేని సంపద “విద్య” మాత్రమే

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి పి.చంద్రయ్య

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-

ఎవరు దొంగిలించలేని సంపద “విద్య” మాత్రమేనని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి లతో కలిసి సి.ఎం. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆకలితో ఉంటే ఉపాధ్యాయులు బోధించే పాఠాలపై ఏకాగ్రత తగ్గుతుందని, పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఏకాగ్రతతో విద్య అభ్యసించేందుకు ఆకలి సమస్య లేకుండా రుచికరమైన, నాణ్యమైన అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు.  విద్యతో ఏదైనా సాధించవచ్చు అని, ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, ఎవరు దొంగిలించలేని సంపద విద్య మాత్రమేనని, విద్య పంచేకొద్దీ పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అల్పాహార పథకాన్ని చేపట్టిందని, బాలికలు రక్తహీనత సమస్యతో బాధపడకుండా అల్పాహారం, మధ్యాహ్న భోజనం లో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తూ నాణ్యమైన విద్యా బోధన అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణను అందిస్తున్నామని, ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించి మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు అందుబాటులో ఉంచి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్య సంస్థలలో నాణ్యమైన విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సబ్జెక్టు లపై అవగాహన కలిగి ఉండాలని, ఇంగ్లీషు భాష పై పట్టు సాధించాలని, చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలని తెలిపారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యతో పాటు క్రీడారంగం, సామాజిక బాధ్యతతో విద్యార్థులు ముందుకు సాగాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో హియరింగ్ ప్రక్రియ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా మ్యాపింగ్ కాని, అనమలిస్ ఓటర్ల నుండి నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు స్వీకరించి పరిశీలించాలని, హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండాలని, అనర్హుల వివరాలు ఎట్టి పరిస్థితులలో జాబితాలో ఉండకూడదని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.