📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి

భూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి

📰 Generate e-Paper Clip

భూపట్టాలివ్వాలని మంత్రి పొంగులేటికి వినతి
ప్రజావాణి ఇనుగుర్తి:తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలం,మీట్య తండాకు చెందిన బానోతు రాజేందర్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఖమ్మంలో పొంగులేటిని కలిసి సంబంధిత భూముల సమస్యలు వివరించినట్లు రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీట్య తండా పరిధిలోని సాగులో ఉన్న ఆర్వోఎఫ్ఆర్ భూములకు సమగ్ర రీసర్వే నిర్వహించి,అర్హులైన గిరిజన రైతాంగానికి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో కూడిన రెవెన్యూ పట్టాలను మంజూరు చేయాలన మంత్రి ని కోరినట్లు పేర్కొన్నారు. మీట్యా తండా గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై స్పష్టమైన పట్టాలు లేకపోవడం తో గిరిజన కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు,వ్యవసాయ రుణాలు,ఇతర మౌలిక సదుపాయాలకు దూరమవుతున్నారని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెవెన్యూ పట్టాల జారీ చేస్తేనే ఈ గిరిజన రైతుల ఆర్థిక స్వావలంబన,పిల్లల భవిష్యత్తు,సామాజిక భద్రతకు భరోసా కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.