📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరైతుల వివాదంతో రోడ్డుకు అడ్డంగా గాడి

రైతుల వివాదంతో రోడ్డుకు అడ్డంగా గాడి

📰 Generate e-Paper Clip

రైతుల వివాదంతో రోడ్డుకు అడ్డంగా గాడి

నెల రోజులుగా నిలిచిన అమ్మపేట–గంధసిరి రాకపోకలు
ముదిగొండ అక్టోబర్ 8 ప్రజావాణి
మండల పరిధిలోని అమ్మపేట–గంధసిరి ప్రధాన రహదారిపై ఇద్దరు రైతుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివాదం నేపథ్యంలో జేసీబీతో రోడ్డుకు అడ్డంగా గాడి తీయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైతులు, గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వివాదాన్ని పరిష్కరించి రహదారిపై రాకపోకలు పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.