📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

బైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

బైరాన్ పల్లిలో మెడిసిటీ హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

120 మందికి ఉచిత వైద్య పరీక్షలు

మద్దూరు అక్టోబర్8, ప్రజా వాణి,

మండలంలోని వీర బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య ఉపసర్పంచ్,మరియు గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో
గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో బీ.పి,షుగర్ పరీక్షలు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు, వరీబిజము,బీజకుట్టు,గడ్డలు,కణతులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచి సంబంధిత సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్,చర్మ సమస్యలు,మోకాళ్ల నొప్పులు,నడుము నొప్పులు,ఊపిరితిత్తుల సమస్యలు చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో 120 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి 35 మందిని హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది.వీరిని హాస్పిటల్ కు తరలించి ఆపరేషన్స్ ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో గ్రామప్రజలు మరియు సిబ్బందితో పాటు డాక్టర్లు డా.శబరీష్ డా.స్వాతి డా.సాత్విక డా.శృతి మార్కెటింగ్ ఇంచార్జులు వెంకటాద్రి,రాకేష్,రాఘవేంద్ర రెడ్డి నర్సింగ్ ఇంచార్జ్,రోజా గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.