📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచెన్నూర్ లో అదనపు కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

చెన్నూర్ లో అదనపు కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

📰 Generate e-Paper Clip

చెన్నూర్ లో అదనపు కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

ప్రజావాణి జైపూర్ అక్టోబర్ 8

చెన్నూరు కోర్టుకు అదనంగా మరో జ్యుడీషియల్‌ మరియు సివిల్‌ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాత్కాలిక అద్దె భవనం కోసం భీమారం, జైపూర్‌ మండలాల్లో పలు భవనాలను బార్‌ సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది.

అదనపు కోర్టు ఏర్పాటుతో చెన్నూరు కోర్టుపై కేసుల భారం తగ్గడంతో పాటు భీమారం, జైపూర్‌ మండలాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. కోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనం, మౌలిక వసతుల కల్పనలో అధికారులు చొరవ చూపితే న్యాయవ్యవస్థ మరింత బలోపేతమై, రెండు మండలాల అభివృద్ధికి ఈ నూతన కోర్టు కీలకంగా మారనుంది. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా అధికారులు, న్యాయవర్గాలు సమన్వయంతో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.