📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహసన్‌పర్తిలో గంజాయి దందాపై సీఐ మహేందర్ ఉక్కుపాదం

హసన్‌పర్తిలో గంజాయి దందాపై సీఐ మహేందర్ ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

హసన్‌పర్తిలో గంజాయి దందాపై సీఐ మహేందర్ ఉక్కుపాదం!

సీఐ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో పోలీసుల దూకుడు

వంగపహాడ్ క్రాస్ వద్ద 100 గ్రాముల గంజాయి పట్టివేత

రూ.5 వేల విలువైన గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు

హసన్‌పర్తి, అక్టోబర్ 7, మన ప్రజావాణి:

హసన్‌పర్తి మండలంలో గంజాయి అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఐ ఎ. మహేందర్ మార్గదర్శకత్వంలో హసన్‌పర్తి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వంగపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.5 వేల విలువైన 100 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సీఐ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ పి. గోవర్ధన్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వంగపహాడ్ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు క్రాస్ రోడ్డు వైపు వస్తూ పోలీసుల కంటపడ్డారు. పోలీసులను గమనించిన వారు పరారయ్యేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిలో ఒకరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

గంజాయి దందాకు చెక్.. ఒకరి అరెస్ట్

పట్టుబడిన వ్యక్తిని **సయ్యద్ గుల్షన్ అలియాస్ సొహేల్ (26)**గా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లకు చెందిన సొహేల్ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో ఒడిశాలోని కోరుమనూర్‌కు చెందిన బాలు వద్ద సొహేల్ అర కిలో గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడైనట్లు తెలిపారు. అనంతరం వంగపహాడ్‌కు చెందిన మొహమ్మద్ ఖాలీద్ అలియాస్ మిన్ను, మొహమ్మద్ సబ్రుతో కలిసి గంజాయిని విక్రయించేందుకు పథకం వేసినట్లు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం వేట

ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురి కోసం సీఐ ఎ. మహేందర్ పర్యవేక్షణలో హసన్‌పర్తి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ ఎ. మహేందర్ హెచ్చరించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.