📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనూతన డీఎస్పీ నిమ్మగడ్డకు మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు

నూతన డీఎస్పీ నిమ్మగడ్డకు మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు

📰 Generate e-Paper Clip

నూతన డీఎస్పీ నిమ్మగడ్డకు మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు

ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా ప్రతినిధి
అక్టోబర్ 7

మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన అన్నా రాంబాబు.. మార్కాపురం నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పలు అంశాలను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో స్థానిక పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాంబాబు వెంట పట్టణ పార్టీ అధ్యక్షుడు సలీం కూడా ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.