📄 ePaper
Epaper 2
Friday, October 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇనుగుర్తిలో లో ఘనంగా పోషణ మాసం

ఇనుగుర్తిలో లో ఘనంగా పోషణ మాసం

📰 Generate e-Paper Clip

ఇనుగుర్తిలో లో ఘనంగా పోషణ మాసం..
పాల్గొన్న జిల్లా మండల అధికారులు..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఘనంగా పోషణ మాసం నిర్వహించారు.దీనికి పలువురు జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరై ప్రసంగిస్తూ తలు సూచనలు చేశారు.
సిడిపిఓ శిరీష మాట్లాడుతూ పోషణ మాసంలో కార్యక్రమాలు నిర్వహించి తల్లులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో కచ్చితంగా గర్భిణీలు బాలింతలు పిల్లలు భోజనం చేసి అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు నెల నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని,పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని చెప్పారు.
సఖి సెంటర్ శ్రావణి మాట్లాడుతూ మహిళలకు ఏ సమస్యలు ఉన్న సఖి సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
హబ్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఆడపిల్లలకి మగ పిల్లలకి వ్యత్యాసం లేకుండా కుటుంబంలో పిల్లలను పెంచాలని చెప్పారు.ఆడపిల్లల శాతం మహబూబాబాద్ జిల్లాలో తక్కువగా ఉందన్నారు.
బి ఆర్ బి పిల్లలను అక్రమ దత్తత తీసుకోవడం నేరమని అలా చేసిన వారికి జైలు శిక్ష కూడా ఉంటుందని బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారధి సిడిపిఓ శిరీష,ఏ సి డి పి ఓ కమలాదేవి,సూపర్వైజర్ దుర్గ,బి ఆర్ బి టీమ్,
అబ్బ టీమ్,సఖి టీం,హెల్త్ సూపర్వైజర్ సుదర్శన్,అంగన్వాడీ టీచర్లు,ఏఎన్ఎంలు,
ఆశాలు,గర్భవతులు,బాలింతలు
,ఆడపిల్ల తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.