📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅబ్దుల్ నగరంలో వీధి దీపం లేక చీకట్లో బొడ్డెమ్మ సంబరాలు - పట్టించుకోని అధికారులు

అబ్దుల్ నగరంలో వీధి దీపం లేక చీకట్లో బొడ్డెమ్మ సంబరాలు – పట్టించుకోని అధికారులు

📰 Generate e-Paper Clip

అబ్దుల్ నగరంలో వీధి దీపం లేక చీకట్లో బొడ్డెమ్మ సంబరాలు – పట్టించుకోని అధికారులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07 (ప్రజావాణి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నగరం గ్రామంలో ప్రధాన రహదారి అయిన తరిగొప్పుల – హనుమకొండ ప్రధాన రహదారిపై రాముని సత్తయ్య కిరాణం దుకాణం వద్ద వీధి దీపం లేకపోవడంతో ఆ ప్రాంతం మొత్తం చీకటిలో మగ్గుతోంది.

ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని ఆడపిల్లలు, మహిళలు సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకునే సమయంలో వీధి దీపం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఇది ప్రధాన రహదారి కావడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు, చిన్నారులు రోడ్డుపై నడవాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పాములు, తేళ్లు వంటి విష జీవుల భయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై ఎన్నిసార్లు గ్రామ సర్పంచ్ కు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పండుగ వేళల్లోనైనా మహిళలు, చిన్నారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ మహిళలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.