📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ మార్కెట్ యార్డులో అక్రమ చెక్కుల వ్యవహారం వాచ్ మెన్ సస్పెన్షన్ కు తీర్మానం

జనగామ మార్కెట్ యార్డులో అక్రమ చెక్కుల వ్యవహారం వాచ్ మెన్ సస్పెన్షన్ కు తీర్మానం

📰 Generate e-Paper Clip

జనగామ మార్కెట్ యార్డులో అక్రమ చెక్కుల వ్యవహారం వాచ్ మెన్ సస్పెన్షన్ కు తీర్మానం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లోని నూతన కార్యాలయంలో ఏఎంసి పాలకవర్గం అత్యవసర సమావేశం బుధవారం నిర్వహించారు.

ఏఎంసి చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ సంతకం లేకుండానే సెప్టెంబర్ 2026 కి సంబంధించిన చెక్కులను కేవలం సెక్రటరీ సంతకంతో ఏఎంసి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్ మెన్ కె.ఐలయ్య ఎస్టిఓ ద్వారా పాస్ చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై చైర్మన్ సిబ్బందిని నిలదీయగా చైర్మన్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కె.ఐలయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎంసి పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి డిఎమ్ఓ కి తీర్మాన పత్రాన్ని అందజేశారు.

అనంతరం ఏఎంసి చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. తమ పాలకవర్గం నిరంతరం రైతులకు, వ్యాపారులకు అందుబాటులో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తుందని, తమకు తెలియకుండా సంతకం లేకుండా చెక్కులను దుర్వినియోగం చేయడంపై ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. గతంలో కూడా అవినీతికి పాల్పడిన వారిపై, విధులు సక్రమంగా నిర్వహించని అధికారులు, సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్లు నాగబండి రవీందర్, నీల మోహన్, బుట్ రెడ్డి శ్రీలత రెడ్డి, ఎండి బాష్మియా, నామాల శ్రీనివాస్, తోటకూరి రమేష్, బానోతు బన్సీ నాయక్, శీలం కొండల్ రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్, నాయకులు రాజిరెడ్డి, ప్రభాకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
పాడెమోసిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ (28) నిన్న అర్ధరాత్రి కుషాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. యువకుడి మృతితో అయినాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం హుటాహుటిన అయినాపూర్ లోని వారి నివాసానికి చేరుకొని మురళి కార్తీక్ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విజేందర్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన, కుటుంబానికి అండగా ఉంటా, ధైర్యంగా ఉండండి” అని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా పాల్గొని పాడెమోశారు. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని మురళి కార్తీక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.