📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకంఠలి లో గ్రామసభ

కంఠలి లో గ్రామసభ

📰 Generate e-Paper Clip

కంఠలి లో గ్రామసభ

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో బుధవారం రోజున గ్రామసభ అలాగే సోషల్ ఆడిట్ సర్పంచ్ నాగనాథ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.. ఊరిలోని సమస్యలు అభివృద్ధి పనులపై గ్రామస్తులతో, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాథ్ మాట్లాడుతూ… గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంది ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రజలందరూ భాగస్వాములు అయితే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు అని, పూరి అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం సోషల్ ఆడిట్ నిర్వహించారు.. ఉపాధి హామీ గురించి గ్రామస్తులకు ఏపీఓ తులసిరాం అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పథకం నిరుపేదలకు చాలా మంచిదని కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు వెళ్లాలని ఈ సందర్భంగా ఏపీఓ తులసి రామ్ అన్నారు. అలాగే ఉపాధి హామీ పేరు నమోదు లేకపోతే పేరు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. సర్పంచ్ నాగనాథ్ ఏపీఓ తులసి రామ్, తత్తరులు గ్రామస్తులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.