📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలి

సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలి

📰 Generate e-Paper Clip

*సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలి…*

*అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.*

*బతుకమ్మలతో మహిళల ర్యాలీ.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*

తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య , ప్రజా నాట్య మండలి కళాకారుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రోజు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి , వాటి చుట్టూ సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు.ముందుగా సిపిఐ జిల్లా కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభకు తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్య క్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి , ప్రకృతి తో మమేకమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా వస్తున్న బతుకమ్మ సంప్ర దాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆడిపాడడంతో కార్య క్రమం పండుగ వాతా వరణాన్ని సంతరించు కుందన్నారు. ప్రభుత్వాలు బతుకమ్మ ఆటపాటలు , కప్ప కాముడు , సంస్కృతి కళారూపాలు అంతరించి పోకుండా కావాల్సిన నిధులు కేటాయించి ప్రోత్సహించి సాంస్కృతిక కళలను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య క్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్ , మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత , జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోలగానిసత్యనారాయణ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ , బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కళ్లెం కృష్ణ గౌడ్ , ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు బుషపాక నరసింహ , ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి నయీమ్ నాయకులు ఇంజా హేమలత , సామల శోభన్ బాబు , పుట్ట రమేష్ , మాటూరి జానమ్మ , యానాల సంధ్య , మంచాల రాధమ్మ , సుగుణ , కట్ల యాదగిరి , మొగుళ్ళ శేఖర్ రెడ్డి , బోడ సోమ నర్సయ్య , జాను , అండాలు , సరిత , పుష్ప, విజయ , సంధ్య , మల్లమ్మ శ్రీదేవి , కవిత , వాణి , లావణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.