కిష్టాపూర్–ఇందారం రోడ్డుపై విచ్చలవిడిగా స్పీడ్ బ్రేకర్లు!
రాత్రివేళ ప్రయాణికులకు తప్పని తిప్పలు.. అత్యవసర రోగులకు నరకయాతన
జైపూర్, ప్రజావాణి అక్టోబర్ 06
కిష్టాపూర్ నుంచి ఇందారం వెళ్లే ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్‌లు, అత్యవసర రోగులు సైతం వరుస స్పీడ్ బ్రేకర్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, రోడ్ మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని, అవసరం లేని స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి కిష్టాపూర్–ఇందారం రహదారిపై స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

