మద్దూరు అక్టోబర్5, ప్రజా వాణి,
మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో గల 1 వార్డ్ ఎస్సీ కాలనీలో మీని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు.క్రీ, శే అలగోని లింగయ్య జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు అలగోని రాములు గ్రామ ప్రజల దాహం తీర్చడానికి తండ్రి జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో ఎస్సీ కాలనీలోని మినీ ట్యాంక్ నిర్మాణం కోసం దాతగా ముందుకు వచ్చినట్లు తెలిపారు బైరాన్ పల్లి గ్రామ ప్రజల దాహం తీర్చడానికి అభివృద్ధిలో భాగస్వామిగా ముందుకు వచ్చినందుకు రాములుకు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం ఎన్ ఆర్ ఐ లు విశ్రాంతి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ తెలిజురి సిద్ధులు పంచాయితీ కార్యదర్శి కట్కూరి రాజు, పెర్కా రమేష్, పెర్కా భూమయ్య, కనక స్వామి, ఉపేందర్ రాజ నరేందర్, కనకయ్య, రాజు, దుర్గయ్య ప్రశాంత్ గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.

