📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగాగిల్లాపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

గాగిల్లాపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,అక్టోబర్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గర్భిణీలు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలని, రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని, గ్రామంలో ఏ ఒక్క తల్లి, బిడ్డ పోషకాహార లోపంతో బాధపడకుండా చూడటం అందరి బాధ్యత అన్నారు.అనంతరం ఏఎన్‌ఎం రాధ గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్ శారద పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, ఏఎన్‌ఎం రాధ, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ శారద, ఆయా కనకవ్వతో పాటు గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.