📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక

చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా కమారం రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా కే. యశ్వంత్

పరిగి, అక్టోబర్04 (ప్రజావాణి):

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) నూతన మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వికారాబాద్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు.. పరిగి డివిజన్ అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కే. శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పండాల సురేష్, డివిజన్ కార్యదర్శి కోస్గి కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు: కమారం రామస్వామి
ప్రధాన కార్యదర్శి: కే. యశ్వంత్
ఉపాధ్యక్షుడు: జోగు శ్రీనయ్య (శ్రీను)
కార్యదర్శులు: పరిగి అశోక్, కొత్త యాదయ్య
ఆర్గనైజింగ్ కార్యదర్శి: డాక్టర్ బి. వెంకటేష్
కోశాధికారి: సంటి చందు
కార్యవర్గ సభ్యులు: నసీర్, బుచ్చయ్య, కోస్గి కుమార్, ఎం. కొండయ్య, శేఖర్, బ్యాగరి శ్రీను, కావాలి నవీన్, మొగిలిగిద్ద గిరి, హన్మంత్ రెడ్డి
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కమారం రామస్వామి మాట్లాడుతూ.. మండలంలోని వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు నాయకులు, పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు.

Previous article
Next article
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 4 ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగించాలి అదేవిధంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలు పార్టీ ఆఫీస్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంపీపీ జడ్పీటీసీ సభ్యుల సన్మాన కార్యక్రమం మరియు ఒంగోలు కార్పొరేషన్ , దర్శి మున్సిపాలిటీ, చీమకుర్తి మున్సిపాలిటీ సమావేశం జరిగినది. ఈ సందర్బంగా ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి మాట్లాడుతూ రాబోవు స్థానిక మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికలలో వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నది దానికి సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రం లో కడప జిల్లా వైస్సార్సీపీ కి కంచుకోట అంటారు అని కాని నా దృష్టిలో ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ కి కంచుకోట అని అన్నారు. రాజ్యసభ సభ్యులు YV సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఏ ఒక్క హమీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు అని అన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరు లబ్ది పొందారు అని అన్నారు. అందుకని రాబోవు స్థానిక ఎన్నికలలో అందరం కలిసి కట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పై పోరాటం చేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి అని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మన పార్టీ సత్తా చాటాలి అని అన్నారు, దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా కు సీనియర్ నాయకులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రీజినల్ కో ఆర్డినేటర్ గా రావడం చాలా సంతోషంగా వుంది అని జిల్లా లో అన్ని నియోజకవర్గాలలో వైస్సార్సీపీ పోటీ చేస్తుంది అని ప్రతి కార్యకర్తకు అండగా నియోజకవర్గ ఇంచార్జ్ లు మేము అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ తూమాటి మాధవరావు,యర్రగొండపాలెం MLA తాటిపత్రి చంద్రశేఖర్,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున,మాజీ MLA లు అన్నా రాంబాబు, జంకె వెంకట రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, అసెంబ్లీ పరిశీలకులు, CEC మెంబెర్స్, SEC మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.