ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థినికి అభినందనలు
ప్రజావాణి పాలేరు అక్టోబర్ 4: తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవి–సరోజ దంపతుల కుమార్తె స్పందన ఎంబీబీఎస్ సీటు సాధించి సంగారెడ్డిలోని తీగల రాంమోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన కుటుంబంలో జన్మించిన స్పందన పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థిని చదువులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు తన ఆశీస్సులు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ నాయకులు ధరావత్ కిసాన్ నాయక్, గూగులోత్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ వట్టికూటి శేషగిరిరావు తదితరులు పాల్గొని స్పందనకు శుభాకాంక్షలు తెలిపారు.

