📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమత్స్యకార సంఘాలకు నూతన కమిటీల ఎన్నికకు సన్నద్ధం

మత్స్యకార సంఘాలకు నూతన కమిటీల ఎన్నికకు సన్నద్ధం

📰 Generate e-Paper Clip

*సూర్యాపేట జిల్లా పాలే అన్నారం మత్స్యశాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం*


చిలుకూరు అక్టోబర్04(ప్రజావాణి):జిల్లా చిలుకూరు మండల పరిధిలోని పాలే అన్నారం మత్స్యశాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి మారయ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, సంఘం కార్యకలాపాలపై చర్చించారు. మత్స్యకార సంఘాలకు నూతన కమిటీలను ఎన్నుకునేందుకు సభ్యులు సన్నద్ధం కావాలని మారయ్య సూచించారు. సంఘాల బలోపేతానికి సభ్యులందరూ ఐక్యంగా పనిచేయాలని, నూతన కమిటీల ను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో మత్స్యకార సంఘం సభ్యులు, మాజీ సర్పంచులు తమ్మర బోయిన శంకర్, మండవ.వెంకటేశ్వర్లు,దేశ బోయిన వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.