📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్ చెక్ పోస్ట్ లో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్ చెక్ పోస్ట్ లో భారీ అగ్నిప్రమాదం

📰 Generate e-Paper Clip


మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని ఫర్నిచర్ దగ్ధమవుతున్నట్లు సమాచారం.
మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా వ్యాపించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.