📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇటిక్యాల, అల్లీపూర్ సహకార సంఘాలకు నూతన అధ్యక్షుల నియామకం

ఇటిక్యాల, అల్లీపూర్ సహకార సంఘాలకు నూతన అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

*ఇటిక్యాల, అల్లీపూర్ సహకార సంఘాలకు నూతన అధ్యక్షుల నియామకం*

రాయికల్, అక్టోబర్ 03 (ప్రజావాణి)

రాయికల్ మండలంలో సహకార రంగానికి కొత్త ఉత్సాహం. మండలంలోని ఇటిక్యాల, అల్లీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇటిక్యాల సంఘ అధ్యక్షుడిగా మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, అల్లీపూర్ సంఘ అధ్యక్షుడిగా తంగెళ్ల రమేష్ లు నియమితులయ్యారు. ఒక్కో సంఘానికి 13 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ సహకార శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.గత కొంతకాలంగా పాలకవర్గాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ నియామకాలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులు మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, తంగెళ్ల రమేష్ లు మాట్లాడుతూ “మాపై నమ్మకం ఉంచి సహకార సంఘ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, రైతుల సహకారంతో సంఘాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందేలా కృషి చేస్తాం. ప్రతి రైతుకు సంఘం అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.తమ నియామకానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు వైద్యులు సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు నందయ్య, రాయికల్ మండల కాంగ్రెసు నాయకత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నియామక అనంతరం కాంగ్రెసు పార్టీ శ్రేణులు, రైతులు, గ్రామ ప్రజలు నూతన అధ్యక్షులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.