📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవినోద్ కుమార్ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు...చౌదరిగూడ పది కాలనీల్లో దోమల మందు పిచికారీ

వినోద్ కుమార్ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు…చౌదరిగూడ పది కాలనీల్లో దోమల మందు పిచికారీ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 3 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడలో పది కాలనీల్లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.

ప్రతి కాలనీలో దోమల నియంత్రణ చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వినోద్ కుమార్ తెలిపారు.

కాలనీల్లో పారిశుధ్య సమస్యలు, దోమల బెడద వంటి ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలను కొనసాగిస్తామని వినోద్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.